Ganneruvaram | నామినేషన్లు స్వీకరించే క్లస్టర్లు ఇవే…

Ganneruvaram | నామినేషన్లు స్వీకరించే క్లస్టర్లు ఇవే…

Ganneruvaram | గన్నేరువరం, ఆంధ్రప్రభ: గన్నేరువరం (Ganneruvaram) మండల పరిధిలోని 17 గ్రామాలకు సంబంధించిన గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ను అధికారులు ఐదు క్లస్టర్లుగా విభజించారు. గన్నేరువరం క్లస్టర్‌ లో చొక్కారావుపల్లి, చాకలివానిపల్లి, యాస్వాడ, గన్నేరువరం, హన్మాజిపల్లి క్లస్టర్‌ లో మైలారం, సాంబాయిపల్లె, హన్మాజిపల్లి, ఖాసింపేట (Khasimpeta) క్లస్టర్‌ లో మాదాపూర్, పారువెల్ల, ఖాసింపేట, గునుకుల కొండాపూర్ క్లస్టర్‌లో చీమలకుంటపల్లి, గుండ్లపల్లి, గునుకులకొండాపూర్, గుండ్లపల్లి స్టేజి, జంగాపల్లి క్లస్టర్‌లో గోపాలపూర్, జంగాపల్లి, పీచుపల్లి గ్రామాలున్నాయి.

మొత్తం 17 గ్రామాల సర్పంచ్ స్థానాల (Sarpanch positions) తో పాటు 140 వార్డు స్థానాలకు సంబంధించిన నామినేషన్ పత్రాలను అధికారులు ఆయా క్లస్టర్ కేంద్రాల్లో స్వీకరించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ ప్రకారం… గన్నేరువరం రెండవ విడతలో భాగంగా ఈనెల 30వ తేదీ నుంచి డిసెంబర్ 2వ తేదీ సాయంత్రం 5గంటల వరకు నామినేషన్లు (nominations) స్వీకరించి, పోలింగ్ డిసెంబరు 14న ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించగా, అదే రోజు మధ్యాహ్నం 2గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. ఆదివారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవడంతో గ్రామాల్లో రాజకీయ కదలికలు మరింత వేగం పుంజుకున్నాయి.

Leave a Reply