Incident | ఒకే ఇంట్లో తల్లి, కొడుకు ఆత్మహత్య

Incident | ఒకే ఇంట్లో తల్లి, కొడుకు ఆత్మహత్య
Incident | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. కనకదుర్గ కాలనీలో ఒకే ఇంట్లో తల్లి, కొడుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
మృతులను కళావతి (45), ఆమె కుమారుడు శివ (20)గా గుర్తించారు. ఇద్దరూ ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటన తెలిసిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సమస్యలా? ఆర్థిక ఇబ్బందులా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
