Accident | బస్సు బోల్తా..

Accident | బస్సు బోల్తా..

Accident | పెద్దారవీడు, ఆంధ్రప్రభ : పెద్దారవీడు మండలంలోని మద్దలకట్ట గ్రామంలో నూజివీడు బస్సు బోల్తాపడి 28 మంది(28 people)కి గాయాలైన సంఘటన ఈ రోజు చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… నూజివీడు నుంచి శ్రీశైలం(Srisailam)కి వెళ్తున్న బస్సు మందలకట్ట గ్రామం వద్ద అదుపుతప్పి బోల్తాపడంది.

దీంతో బస్సులో ఉన్న వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిలో అధిక సంఖ్యలో శివ స్వాములు శివ దర్శనానికి వెళుతున్నట్లు సమాచారం. పెద్దారవీడు ఎస్ఐ సాంబశివయ్య(SI Sambasivaiah) సంఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం గాయాలైన వారిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.