Bikkanoor | మెరుగైన వైద్య సేవలు అందించాలి….

Bikkanoor | బిక్కనూర్, ఆంధ్రప్రభ : ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న బాలునికి మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. బిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన పూసల బాలరాజ్ తో పాటు ఆయన భార్యా మెదక్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారి కుమారుడు అభిలాష్ కామారెడ్డి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

విషయం తెలుసుకున్న ఇంద్రకరణ్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి బాలుని ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి వైద్యులతో మాట్లాడారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెంది పిల్లలు అనాధలు కావడం ఎంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
