చిన్న బెల్లాల్ లో ప్రిం ప్రైమరీ పాఠశాల ప్రారంభం..

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని చిన్నబెల్లాల్ ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం ప్రీ-ప్రైమరీ తరగతులను గ్రామ సర్పంచ్ బొంతల లక్ష్మి భూమన్న యాదవ్ ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్ బొంతల లక్ష్మి మాట్లాడుతూ, మూడు నుంచి ఐదు సంవత్సరాల వయస్సు గల చిన్నారులను ప్రీ-ప్రైమరీ తరగతుల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత విద్యార్హతలు కలిగిన ఉపాధ్యాయులు ఉండటంతో నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు.

ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని కోరారు. గ్రామస్తులందరూ కలిసి పాఠశాల అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు క్రాంతికుమార్, పంచాయతీ కార్యదర్శి గిరిధర్, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు ఆకాంక్ష, రజిత, శరత్, అశ్విని, మల్లేశ్వరి, నరసయ్య, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.