పెంచిన ఇంధన, గ్యాస్ ధరలు తగ్గించాలి

పెంచిన ఇంధన, గ్యాస్ ధరలు తగ్గించాలి

వికారాబాద్, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆధ్వర్యంలో బుధవారం వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు.

జిల్లా సీపీఐ కార్యదర్శి విజయలక్ష్మి పండిట్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం అదనపు కలెక్టర్‌ను కలిసి మెమొరాండం అందజేసింది.

ఈ సందర్భంగా విజయలక్ష్మి పండిట్ మాట్లాడుతూ, పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే సామాన్య ప్రజలు ధరల భారం మోస్తున్న పరిస్థితుల్లో ఇంధన ధరల పెంపు ప్రజలపై అదనపు భారంగా మారిందని పేర్కొన్నారు.

పెరిగిన ధరలను వెంటనే వెనక్కి తీసుకుని, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు అనంతయ్య, పుష్పమ్మ, లక్ష్మీనరసింహ తదితరులు పాల్గొన్నారు.