Fourth Class Employee | మానవత్వం పరిమళించింది

Fourth Class Employee | మానవత్వం పరిమళించింది

  • చిరుద్యోగి పాడి కాడి మోసిన మండల మెజిస్ట్రేట్
  • మట్టి ఖర్చులు నిమిత్తం తక్షణసాయంగా 25000 అందజేత
  • గ్రామ నౌకర్ (వీఆర్ఏ) భౌతికాయానికి నివాళులర్పించిన తహసిల్దార్
  • వీఆర్ఏ (చిన్న) కుటుంబ సభ్యులను ఓదార్చిన తాసిల్దార్
  • చిన్న భౌతికాయానికి నివాళులర్పించిన రెవిన్యూ సిబ్బంది
  • సీనియర్ వీఆర్ఏకు ఘన నివాళులు

Fourth Class Employee | మోపిదేవి(కృష్ణాజిల్లా) ఆంధ్ర‌ప్ర‌భ : మానవత్వం పరిమళించింది. తన కింద పని చేసే ఫోర్త్ క్లాస్ ఎంప్లాయ్ (చిరు ఉద్యోగి) అనారోగ్యంతో అకాల మరణం చెందగా… ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి, ఆయన పాడి కాడిని తాసిల్దార్ ముప్పిరి శెట్టి హరినాథ్ మోశారు.

సంక్రాంతి పండుగలో భాగంగా మొదటి రోజు భోగి ఫెస్టివల్(Bhogi Festival) సెలవు దినం అయినప్పటికీ తన కింద పని చేసే చిరుద్యోగి అనారోగ్యంతో మరణించారని విషయం తెలుసుకుని ఆయన భౌతికకాయానికి నివాళులర్పించేందుకు ప్రత్యేకంగా మోపిదేవి వీఆర్ఏ వోగిరాల వెంకటేశ్వర్లు (74) మోపిదేవి శివారు రావు వారి పాలెం గ్రామంలో ఆయన ఇంటికి వెళ్లి పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి వీఆర్ఏ ఓగిరాల వెంకటేశ్వర్లు (చిన్న) అంతిమయాత్రలో పాల్గొని ఆయన భౌతికకాయాన్ని ఉన్న పాడికాడిను ఆయన మోసారు.

Bhogi Festival |

మండల తాసిల్దార్ మండల మెజిస్ట్రేట్ హోదాలో ఆయన వీఆర్ఏ అంతిమయాత్రలో పాల్గొన్నారు. మోపిదేవి మండల రెవెన్యూ యంత్రాంగం మొత్తం కదిలి వచ్చింది. రెవెన్యూ అధికారులు అందరూ మానవత్వం చాటుకున్నారు. అందరితో మంచిగా ఉండి అందర్నీ చక్కగా పలకరించే వీఆర్ఏ చిన్న అకాల మరణం అందరిని కలిసి వేసిందని రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు.

మట్టి ఖర్చులు నిమిత్తం 25000 అందజేత..

Bhogi Festival |

వీఆర్ఏ వెంకటేశ్వర్లు (చిన్న) సర్వీస్ లో ఉండగా మరణించడంతో ఆయన భౌతిక కాయం మట్టి ఖర్చులు నిమిత్తం తక్షణసాయంగా మండల తాసిల్దార్ హరినాథ్ మంచి మనసుతో స్పందించి 25 వేల రూపాయలను వెంటనే చిన్న కుటుంబ సభ్యులకు అందజేశారు. నెల రోజుల కిందట కూతురు అనారోగ్యంతో మరణించడంతో మానసికంగా కృంగిపోయిన వీఆర్ఏ చిన్నా కూడా అనారోగ్యంతో మ‌రణించడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Bhogi Festival |

మోపిదేవి వీఆర్ఏగా విధులు నిర్వహిస్తున్న ఓగిరాల వెంకటేశ్వర్లు (74 ) అనారోగ్యంతో మరణించడంతో మోపిదేవి రావివారిపాలెం గ్రామాల్లో భోగి పండుగ రోజున విషాదం నెలకొంది. వీఆర్ఏ చిన్నాకు భార్య నలుగురు పిల్లలు ఉన్నారు. ఒక కుమార్తె నెలరోజుల కిందట మరణించగా ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు. మోపిదేవి మండల తాసిల్దార్ హరినాథ్ ప్రత్యేకంగా మానవత్వం చాటుకోవడంతో గ్రామస్తులు, ఆయన కుటుంబ సభ్యులు తాసిల్దార్ హరినాధ్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.

CLICK HERE TO READ MORE : Passengers | క్రేన్ రైలుపై ప‌డి… 22 మంది మృతి

CLICK HERE TO READ MORE :

Leave a Reply