టీఎన్జీవోస్ భవనంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
నల్గొండ, ఆంధ్రప్రభ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ భవనంలో యూనియన్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నాగిళ్ల మురళి జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో త్యాగ ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరులను స్మరించుకుంటూ వారి త్యాగాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిఎన్జిఎస్ జిల్లా కార్యదర్శి శేఖర్ రెడ్డి, సునీత, వసతి గృహ సంక్షేమ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు రణదేవ్, కార్యదర్శి సత్యనారాయణ, యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
