PawanTalk | సమావేశానికి అనుమతిస్తారని ఆశిస్తున్నా…

PawanTalk | సమావేశానికి అనుమతిస్తారని ఆశిస్తున్నా…

PawanTalk | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించి దేశంలో ఆదర్శ రాష్ట్రంగా నిలవాలని ఆకాంక్షించారు.

తెలంగాణ గడ్డతో జనసేనకు అనుబంధం

తెలంగాణ నేలతో జనసేన పార్టీకి ప్రత్యేక అనుబంధం ఉందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. జనసేన ఊపిరి పోసుకున్నది తెలంగాణ గడ్డపైనేనని, ఈ నేల నుంచే పోరాట స్ఫూర్తి, ప్రజా సమస్యలపై పోరాడే పటిమను పొందిందని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, పోరాట స్ఫూర్తి తనకు ఎప్పుడూ ప్రేరణగా నిలిచిందన్నారు.

సాయంత్రం మీడియాతో మాట్లాడనున్న పవన్

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పవన్ కల్యాణ్ ‘ఎక్స్‌’ వేదికగా ప్రత్యేక సందేశాన్ని పోస్టు చేశారు. అలాగే ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మీడియాను ఉద్దేశించి మాట్లాడనున్నట్లు వెల్లడించారు. సమావేశానికి పోలీసులు అనుమతి ఇస్తారని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పవన్ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి.

Leave a Reply