ఉప సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

మరిపెడ, ఆంధ్రప్రభ ; మండలంలోని గుండెపుడి గ్రామ ఉపసర్పంచ్ గడ్డం ఉపేందర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇటీవల గడ్డం నారాయణమ్మ (95) అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న డోర్నకల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ధరంసోత్ రెడ్యానాయక్, గడ్డం ఉపేందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉపాధ్యాయులు, గ్రామ సర్పంచ్ లకావత్ రవికుమార్, పార్టీ అధ్యక్షుడు యామని రామమూర్తి, బిఆర్ఎస్ నాయకులు బోడపట్ల సుధాకర్, పులుసు చిరంజీవి, వెంకట్ రెడ్డి, గంట్ల పాపిరెడ్డి, సోమిరెడ్డి, జోగి రెడ్డి, వార్డు మెంబర్ పసునూటి వెంకటరెడ్డి, పులుసు వెంకన్న, వెంకట్రాంరెడ్డి, బోడపట్ల లింగన్న, అశోక్, బానోత్ సురేష్, నరసయ్య, శ్రీను, లచ్చు తదితరులు ఉన్నారు.