Former Minister | అప్పటి వరకు పోరాటం ఆగదు

Former Minister | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో కూలుస్తానని మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసే వరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

సీఎం చంద్రబాబు అనుచిత వ్యాఖ్యల కేసు విషయంలో కడప జిల్లా వేంపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్తూ ఇడుపులపాయలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద అంబటి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నిక కుట్రలు, దాడులు, కేసులు, జైళ్లు ఎన్ని ఎదురైనా వెనక్కి తగ్గేది లేదని, ధైర్యంగా పోరాటం కొనసాగిస్తానని తెలిపారు. ప్రజలను మోసం చేసిన ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఒత్తిడితోనే తనపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారని అంబటి రాంబాబు ఆరోపించారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే ఈ చర్యలు జరుగుతున్నాయని విమర్శించారు.