పది ఫలితాల్లో మెరిసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడి కుమార్తె

పది ఫలితాల్లో మెరిసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడి కుమార్తె

శ్రీకాకుళం జడ్పీహైస్కూల్ విద్యార్థిని మండలం ఫస్ట్..

ఘంటసాల – ఆంధ్రప్రభ : పది ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని సత్తా చాటింది. 585 మార్కులు సాధించి మండలం ఫస్ట్ సాధించింది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈమె తండ్రి తోపుల నాగబాబు (శ్రీకాకుళం ఎంపీపీ స్కూల్లో ఉపాధ్యాయుడు)గా పని చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు అయినప్పటికీ కాన్వెంట్ల వైపు పిల్లలను పంపకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివించి మండల ఫస్ట్ రావటం పట్ల తోపుల నాగబాబు సంతోషం వ్యక్తం చేశారు.

తన కుమార్తెను ట్రిపుల్ ఐటీలో సీటు వస్తే మంచి చదువుకోవాలని ఆశపడుతుందని తెలిపారు. చదువుకోవాలనే మనస్సు ఉంటే ఎంతటి ప్రభుత్వ పాఠశాలలో కూడా విజయాలు సాధించగలమని ఆయన తెలిపారు. తాము ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని ఉద్యోగం సాధించామని, తన కుమార్తెను కూడా అలాగే ప్రభుత్వ పాఠశాలలో చదివించానని, ఉత్తమ ఫలితాలు సాధించటానికి జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులు కృషి చేశారని తెలిపారుర. తన భార్య బిఎస్సీ బిఈడి చేశారని తెలిపారు.

Leave a Reply