rohith sharma|హ్యాపీ బ‌ర్త్‌డే హిట్‌మ్యాన్‌

rohith sharma|హ్యాపీ బ‌ర్త్‌డే హిట్‌మ్యాన్‌

39వ వసంతంలోకి రోహిత్

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : భారత క్రికెట్ జట్టు కెప్టెన్, ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ ఇవాళ 39వ పుట్టిన రోజు జ‌రుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు, ప్ర‌ముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. టీమిండియాకు భారత్​కు ఐసీసీ ట్రోఫీ అందించిన అతికొద్దిమంది కెప్టెన్ల‌లో రోహిత్‌ ఒక‌రు. రోహిత్ శ‌ర్మ టెస్టులు, టీ20లకు ఇప్ప‌టికే రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. ప్రస్తుతం వన్డేలు మాత్ర‌మే ఆడుతున్నాడు. ఐపీఎల్‌లోనూ ముంబై జ‌ట్టుకు ఆడుతున్నాడు. ప్ర‌స్తుతం గాయంతో బాధ‌ప‌డుతున్న రోహిత్ ఐపీఎల్‌లోనూ కొన్ని మ్యాచుల‌కు దూరంగా ఉంటున్నాడు.

  • అంతర్జాతీయ వ‌న్డే క్రికెట్​లో అత్య‌ధిక స్కోర్ రోహిత్ శర్మదే.
  • 2014లో శ్రీలంకపై జరిగిన మ్యాచ్​లో 173 బంతుల్లోనే 264 పరుగులు చేశాడు.
  • ప్రపంచంలో వ‌న్డేలో మూడు డ‌బుల్ సెంచ‌రీలు సాధించిన ఏ బ్యాటర్ రోహిత్ మాత్రమే.
  • 2013లో తొలిసారి బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాపై రోహిత్ అజేయంగా 209 పరుగులు
  • ఆ తర్వాత ఏడాది కోల్‌కతాలో శ్రీలంకపై 264 పరుగులు
  • 2017లో మొహాలీ వేదికగా శ్రీలంకపైనే 208 పరుగులు చేశాడు.
  • 2019 ఐసీసీ వన్డే వరల్డ్​ కప్‌లో 9 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 5 శతకాలు సాధించాడు.
  • ఓవరాల్​గా వన్డే ప్రపంచకప్​లో హిట్​మ్యాన్ మొత్తం 7 శతకాలు సాధించాడు.
  • హిట్​మ్యాన్ నాయకత్వంలో భారత్ ఒక ఏడాది వ్యవధిలోనే రెండు ఐసీసీ ట్రోఫీలను గెలుచుకుంది.
  • తొలుత 2024 T20 ప్రపంచ కప్‌, తర్వాత 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఛాంపియన్​గా నిలిచింది.
  • ఇప్పటిదాకా రోహిత్ అంతర్జాతీయ క్రికెట్‌లో 650 సిక్స్​లు బాదాడు.
  • దీంతో ఇంటర్నేషనల్ క్రికెట్​లో రోహిత్ టాప్​లో కొనసాగుతున్నాడు.
  • ఈ లిస్ట్​లో భారత్ నుంచి రెండో స్థానంలో మహేంద్రసింగ్ ధోనీ (359) ఉన్నాడు.

Leave a Reply