Foreign Tour | కుటుంబంతో కలిసి యూరప్ పయనం!

Foreign Tour | కుటుంబంతో కలిసి యూరప్ పయనం!
Foreign Tour | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు బయలుదేరారు .
తన కుటుంబ సభ్యులతో కలిసి యూరప్‌లోని పలు దేశాలను సందర్శించేందుకు ఆయనకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం అనుమతిని ఇచ్చింది. మే 15వ తేదీ వరకు ఆయన ఈ పర్యటనలో ఉండనున్నారు. రాజకీయాల నుంచి కాస్త బ్రేక్ తీసుకుని, లండన్‌లో ఉన్న తన కుమార్తెలు, కుటుంబంతో కలిసి సరదాగా గడపనున్నారు.
ఎప్పుడూ రాజకీయ వేదికలపై తన సిగ్నేచర్ స్టైలైన తెల్ల చొక్కా, ఫార్మల్ ప్యాంటులో కనిపించే జగన్.. ఈసారి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎవరికీ ఊహించని సరికొత్త లుక్‌లో కనిపించి ఆశ్చర్యపరిచారు. బ్లూ కలర్ డెనిమ్ షర్ట్, మ్యాచింగ్ బ్లూ జీన్స్ ప్యాంట్, ట్రెండీ కళ్లజోడుతో పాటు క్లీన్ షేవ్ చేసుకుని ఆయన చాలా స్టైలిష్‌గా, యంగ్‌గా కనిపించారు. అర్ధరాత్రి ఎయిర్‌పోర్టులో జగన్ ట్రెండీ లుక్‌ను చూసిన ప్రయాణికులు, అభిమానులు ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. జగన్ కూడా చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ ఫొటోలకు పోజులిచ్చారు.
