వైభవంగా వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు

నర్సింహులపేట, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 333వ ఆరాధనోత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.అర్చకులు రాగి యాకేంద్ర చార్యుల ఆధ్వర్యంలో స్వామివారికి గణపతి పూజ,స్వస్తి పుణ్యాహవాచనం, మండపారాధన,పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు దక్షిణామూర్తి,నాగేశ్వర చారి,సోమ నరసయ్య చారి,రామచంద్రయ్య, బ్రహ్మచారి,రాజు,ప్రసాద్,విశ్వనాథం శేషు కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply