సుప్రీంకోర్టులో….
సుప్రీంకోర్టులో….
ఆగస్టు 21, 22, 23 తేదీలలో ప్రత్యేక లోక్ అదాలత్…!
న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ జియావుద్దిన్
పల్నాడు ప్రతినిధి, ఆంధ్రప్రభ : సుప్రీంకోర్టులో….ఈ ఏడాది ఆగస్టు 21, 22, 23 తేదీలలో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ జియావుద్దిన్ తెలిపారు. “సమాధాన్ సమారోహ – 2026” లో భాగంగా శనివారం ఆయన పల్నాడు జిల్లా, సత్తెనపల్లి పట్టణంలోని ఏరియా వైద్యశాల సమీపంలో పలువురు బాటసారులతో, చిరు వ్యాపారులతో మాట్లాడారు. అనంతరం స్థానిక సబ్ జైల్ ను సందర్శించి, ఖైదీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా జియావుద్దిన్ గారు మాట్లాడుతూ…సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న వ్యత్యాలను కక్షిదారులు పరిష్కరించు కోవాలని సూచించారు.
ఫిర్యాదిదారులు, కక్షిదారులు సుప్రీంకోర్టు వారి అంగీకారంతో వారి వారి, న్యాయవాదులతో జిల్లాలోనే వర్చువల్ గా హాజరుకావచ్చునన్నారు. రాజీమార్గం ద్వారా తమ వ్యాజ్యాలను పరిష్కరించుకోవడానికి ఇష్టపడితే తమ కేసులను పరిశీలన కోసం నిర్దేశించిన, గూగుల్ ఫోరంల ద్వారా వారి అంగీకారాన్ని ఈ నెల 31వ తేదీ లోగా సమర్పించాలని సూచించారు. కేసుల పరిష్కారంలో సందేహాలు ఉన్నట్లయితే 15100 ద్వారా సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ నరహరి నాగ మల్లేశ్వరరావు, న్యాయవాది బి.యల్.కోటేశ్వర రావు, పారా లీగల్ వాలంటీర్లు షేక్ సుభాని, అట్లూరి జ్యోతి ,బాబు రాజేంద్ర జయన్ ప్రసాద్, టి.గోపయ్య, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
