అగ్నిప్రమాదాల నివారణకు అప్రమత్తత అవసరం

అగ్నిప్రమాదాల నివారణకు అప్రమత్తత అవసరం

  • ఎమ్మెల్యే గొండు శంకర్
    శ్రీకాకుళంలో అగ్నిమాపక వారోత్సవాలు

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : అగ్నిమాపక వారోత్సవాల భాగంగా మంగళవారం శ్రీకాకుళం ఏడు రోడ్ల సమీపంలోని అగ్నిమాపక కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమాన్ని స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రారంభించారు. అగ్నిమాపక సిబ్బంది అగ్ని ప్రమాదాల సమయంలో చేపట్టే రక్షణ చర్యలను ప్రదర్శిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అగ్నిప్రమాదాలు నివారించడానికి ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరమన్నారు.

గృహాలలో గ్యాస్ సిలిండర్లు, విద్యుత్ పరికరాలను సురక్షితంగా వినియోగించాలని సూచించారు. నిర్లక్ష్యం వల్ల చిన్న ఘటనలు పెద్ద ప్రమాదాలుగా మారే అవకాశముందని హెచ్చరించారు. అగ్నిమాపక సిబ్బంది సమయానికి స్పందించి అనేక ప్రాణాలను కాపాడుతున్నారని, వారి సేవలు ప్రశంసనీయమని అన్నారు. ప్రజలు కూడా అత్యవసర సమయంలో అగ్నిమాపక శాఖకు సహకరించాలని కోరారు.

అగ్నిమాపక వారోత్సవాల ద్వారా ప్రజల్లో అవగాహన పెంపొందించడమే లక్ష్యమని తెలియచేస్తూ.. ప్రతి ఒక్కరూ అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply