సేవలకు ప్రభుత్వ గుర్తింపు కల్పించాలి…

సేవలకు ప్రభుత్వ గుర్తింపు కల్పించాలి…

నరసరావుపేట, ఆంధ్రప్రభ : నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీ కృష్ణ దేవరాయలుని మంగళవారం గుంటూరులో ఆర్ఎంపీలకు సంబంధించిన ఎఫ్‌ఈఎంపీఏ(ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ) సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలను ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయలుకి వివరించారు.

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందించడంలో ఆర్ఎంపీలు పోషిస్తున్న పాత్ర అత్యంత కీలకమని, ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో మొదటి స్పందనగా నిలుస్తున్న తమ సేవలకు ప్రభుత్వ గుర్తింపు కల్పించాలని, ఈ వృత్తికి చట్టబద్ధత ఇవ్వాలని అసోసియేషన్ సభ్యులు విజ్ఞప్తి చేశారు.

అలాగే, అసోసియేషన్‌కు గౌరవ సలహాదారునిగా కొనసాగాలని ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయకుని కోరగా, అందుకు అంగీకారం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆర్ఎంపీలు మరింత శిక్షణ పొందుతూ, ఆధునిక వైద్య పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ప్రజలకు నాణ్యమైన, బాధ్యతాయుత సేవలు అందించాలని సూచించారు. వారు ప్రస్తావించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సాధ్యమైన పరిష్కార మార్గాలపై కృషి చేస్తానని ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయలు హామీ ఇచ్చారు.

Leave a Reply