గాజువాకలో ఘోర ప్రమాదం..

గాజువాకలో ఘోర ప్రమాదం..

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌: విశాఖపట్నం గాజువాకలో శ్రీనగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజమండ్రి నుంచి పార్వతీపురం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆగివున్న లారీని ఢీ కొట్డడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు, ఒక డ్రైవర్ మరణించారు.

ఏడుగురికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని విశాఖ కేజీహెచ్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్‌ నిర్లక్ష్యమా, వాహనంలో సాంకేతిక లోపమా, లేక రోడ్డు పరిస్థితుల కారణంగా ప్రమాదం జరిగిందా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.