బాల్క సుమన్ కు 14 రోజుల రిమాండ్
బాల్క సుమన్ కు 14 రోజుల రిమాండ్
హైదరాబాద్, ఆంధ్రప్రభ : మాజీ పార్లమెంటు సభ్యులు బాల్క సుమన్ కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ మెజిస్ట్రేట్ తీర్పునిచ్చారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని నాంపల్లి పోలీసులు బాల్క సుమన్ పై కేసు నమోదు చేసిన విషయం విధితమే. ఈ మేరకు శనివారం తెలంగాణ భవన్ వద్ద బాల్క సుమన్ ను అదుపులోకి తీసుకొని నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేసి అనంతరం శనివారం రాత్రి కింగ్ కోటి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం హిమాయత్ నగర్ లోని మెజిస్ట్రేట్ ఇంటి వద్ద బాల్క సుమన్ ను న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు.
ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి అర్థరాత్రే తర్వాత బాల్క సుమన్ కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు బాల్క సుమన్ ను పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. సింగరేణి లో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నిస్తే ప్రభుత్వం కక్ష సాధింపులు భాగంగా తన పై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసిందని బాల్క సుమన్ ఆరోపించారు. అరెస్టులకు తాము భయపడేది లేదని ప్రజల పక్షాన ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామన్నారు.
