1000 డాలర్లు మాయం. అసలు ఏం జరిగింది..?

1000 డాలర్లు మాయం. అసలు ఏం జరిగింది..?

  • శ్రీవారి దర్శనానికి వచ్చిన ఎన్నారై కుటుంబానికి షాక్
  • అలిపిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు, కేసు నమోదు

తిరుపతి క్రైమ్, ఆంధ్రప్రభ : నగరంలోని ఓ ప్రముఖ హోటల్‌లో లాకర్‌లో ఉంచిన 1000 అమెరికన్ డాలర్లు మాయమైన ఘటన వెలుగులోకి వచ్చింది. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మారస సరోవరం హోటల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సింగపూర్‌ నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చిన ఎన్నారై ఆర్ముగం కుటుంబం హోటల్‌లోని రూమ్ నంబర్ 1017లో బస చేసింది. శుక్రవారం ఉదయం తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్లిన కుటుంబ సభ్యులు సాయంత్రం తిరిగి హోటల్‌కు చేరుకున్నారు.

అనంతరం గదిలోని లాకర్‌ను పరిశీలించగా అందులో ఉంచిన 1000 అమెరికన్ డాలర్లు కనిపించకపోవడంతో వారు షాక్ అయ్యారు. దీంతో బాధితుడు ఆర్ముగం అలిపిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు క్రైమ్ నంబర్ 191/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనపై అలిపిరి ఎస్‌ఐ దుర్గాప్రసాద్ విచారణ చేపట్టి, హోటల్ సీసీటీవీ ఫుటేజీలు మరియు ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నారు.

Leave a Reply