Farmer Assurance | రైతు భరోసా అందేది ఎన్నడో…?

Farmer Assurance | రైతు భరోసా అందేది ఎన్నడో…?

  • యాసంగి సీజన్ ప్రారంభమై 22 రోజులు పూర్తి …
  • ఇంకా అందని రైతు భరోసా సాయం …!
  • తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో రైతులు

Farmer Assurance | బచ్చన్నపేట, ఆంధ్రప్రభ : బచ్చన్నపేట మండల వ్యాప్తంగా రైతు భరోసా(Farmer Assurance) సాయం కోసం యాసంగి సేద్యం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. గత 22 రోజుల నుండి మండల వ్యాప్తంగా వ్యవసాయ పనులు ప్రారంభించిన రైతులు చేతిలో చిల్లిగవ్వలేక ఏరువాక ఎట్లా సాగించాలని ప్రభుత్వాన్ని, వ్యవసాయ శాఖ అధికారులను మండల రైతులు ప్రశ్నిస్తున్నారు.

ప్రతి సంవత్సరం రైతు భరోసా సాయం కొన్ని రోజులు ఆలస్యమైనప్పటి కీ పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ అయ్యేది. ప్రస్తుతం ఈ సంవత్సరం యాసంగి సీజన్ ప్రారంభమై 50 శాతం(50 percent) కలుపులు పూర్తవుతున్న ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా రైతు భరోసా క్రింద వంట పెట్టుబడి సాయం రైతుల బ్యాంక్ అకౌంట్లో డబ్బు జమ కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ సందర్భంగా మండల వ్యాప్తంగా ఉన్న ఆయా గ్రామాల రైతులు మాట్లాడుతూ, యాసంగి సీజన్ ప్రారంభమై 50 శాతం నాట్లు పడుతన్నప్పటికీ ప్రభుత్వం(government) నుండి రైతు భరోసా కింద డబ్బులు తమకు అందలేదని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఒకవైపు యాసంగి పంటల సాగుకు రైతుల చేతిలో చెల్లి గవ్వ లేకపోవడంతో, ఉన్న కొంత డబ్బుతో పనులు ప్రారంభించినప్పటికీ అవి ఏ మూలకు సరిపోయే పరిస్థితి లేదని అన్నారు.

రైతు భరోసా పథకంలో భాగంగా వంట పెట్టుబడి సహాయాన్ని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే తమ వద్ద ఉన్న కొంత నగదుతో కొంతవరకు పనులు పూర్తి చేసుకున్నామని చాలావరకు అప్పులు చేసి పంట పెట్టుబడి(crop investment) పెట్టామని ఈ సందర్భంగా తెలిపారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి రైతు భరోసా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇంకా రెండు, మూడు రోజుల్లోపు రైతు భరోసా నిధులు గనక రైతులకు సకాలంలో ప్రభుత్వం విడుదల చేయకపోతే రైతులు తీవ్రముగా నష్టపోతామని తెలిపారు. ఇప్పటికే చాలా వరకు అప్పులు చేసి వ్యవసాయం పనులు ప్రారంభించామని రైతులు తెలిపారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల కష్టాలకు గుర్తించి, రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని విడుదల చేస్తేనే పూర్తిస్థాయిలో రైతులకు న్యాయం( justice for farmers) జరుగుతుందని ఈ సందర్భంగా మండల రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రతి సంవత్సరం సరైన సమయానికి రైతు భరోసా పంట పెట్టుబడి సహాయాన్ని విడుదల చేసినట్లయితేనే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని, అలా కాకుండా ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం సమయానికి ఇవ్వకపోతే పంట పెట్టుబడి కోసం అప్పులు చేయవలసి వస్తుందని ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని మందల రైతులు తీవ్ర ఆవేదనతో తెలిపారు.

ఈ సందర్భంగా ప్రభుత్వం ముందుచూపుతో గ్రామపంచాయతీ ఎన్నికలు(elections) ఉన్నప్పటికీ ఎలక్షన్ కమిషన్ అనుమతితో రైతు భరోసా సాయాన్ని అందించాల్సిందని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గతం ప్రభుత్వాల హయాంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఎలక్షన్ కమిషన్ నుండి ముందస్తు అనుమతులు తీసుకొని పంట పెట్టుబడి సాయాన్ని సమయానికి అందజేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

ఏది ఏమైన‌ప్పటికీ యాసంగి సీజన్ ప్రారంభమై 22 రోజులు(22 days) గడుస్తున్నప్పటికీ మండల వ్యాప్తంగా ఉన్న రైతులకు రైతు భరోసా పంట పెట్టుబడి సాయాన్ని వెంటనే అందించి రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా మండల రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు..

Leave a Reply