Fake-Ai-Posters : నకిలీ పోస్టర్లు కలకలం Andhra Prabha Top News

Fake-Ai-Posters : నకిలీ పోస్టర్లు కలకలం Andhra Prabha Top News

  • ఉచిత అక్షరాభ్యాసం’పై
  • ఏ ఐ సాయంతో తప్పుడు ప్రచారం
  • భక్తులు అప్రమత్తంగా ఉండాలి
  • అధికారిక ప్రకటనలనే విశ్వసించాలి
  • భక్తులను గందరగోళానికి గురిచేసే వారిపై కఠిన చర్యలు
  • వెబ్‌సైట్, టోల్‌ఫ్రీ నంబర్ ద్వారానే వివరాలు తెలుసుకోవాలి
  • దుర్గగుడి ఈవో శీనా నాయక్

( ఆంధ్రప్రభ ఇంద్రకీలాద్రి)

Fake-Ai-Posters : జగన్మాత కనక దుర్గమ్మ తల్లి దేవస్థానం పేరిట నకిలీ పోస్టర్లు కలకలం రేపాయి. ఈ దేవస్థానం ఆధ్వర్యంలో త్వరల జరగనున్న ఉచతి అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని తప్పుదోవ పట్టించే రీతిలో సోషల్​ మీడియాలో నకిలీ పోస్టరు వెలిశాయి. భక్తులను గందర గోళానికి గురి చేస్తున్న తరుణంలో ఇంద్రకీలాద్రి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి తీవ్రంగా స్పందించారు.
విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం నిర్వహించే ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలకు సంబంధించి దేవస్థానం విడుదల చేసే అధికారిక సమాచారాన్ని మాత్రమే భక్తులు విశ్వసించాలని దేవస్థానం కార్యనిర్వహణాధికారి వీకే శీనా నాయక్ విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియా వేదికగా అనధికారిక వ్యక్తులు ప్రచారం చేసే తప్పుడు ప్రకటనలు, పోస్టర్లను నమ్మి గందరగోళానికి గురికావద్దని సూచించారు. ఈ నెల 17న నిర్వహించనున్న ఉచిత అక్షరాభ్యాస మహోత్సవానికి సంబంధించి దేవస్థానం జూన్ 12న అధికారిక ప్రకటన విడుదల చేసిందని, ఆ వివరాలు పలు ప్రధాన మాధ్యమాల్లో ప్రచురితమయ్యాయని తెలిపారు. అయితే కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు అధికారిక ప్రకటనలో లేని అంశాలను జోడించి, కృత్రిమ మేధ (ఏ ఐ )సాంకేతికతను ఉపయోగించి నకిలీ పోస్టర్లను రూపొందించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ తప్పుడు పోస్టర్లు చూసి పలువురు భక్తులు నిజానిజాలు తెలుసుకునేందుకు దేవస్థానం కార్యాలయాన్ని ఫోన్ ద్వారా సంప్రదిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో భక్తులు ఎలాంటి అపోహలకు లోనుకాకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ఈవో స్పష్టం చేశారు. దేవస్థానం ప్రతిష్ఠకు భంగం కలిగించేలా, భక్తులను తప్పుదోవ పట్టించేలా నకిలీ ఏ ఐ పోస్టర్లను సృష్టించి ప్రచారం చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వీకే శీనా నాయక్ హెచ్చరించారు. అమ్మవారి ఆలయ కార్యక్రమాలకు సంబంధించిన

Leave a Reply