ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి…
చెన్నూర్, ఆంధ్రప్రభ : భవిష్యత్ తరలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందివ్వాలంటే ప్రతి ఒక్కరు తమ తమ ఇంటి పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని చెన్నూర్ మున్సిఫ్ కోర్టు జడ్జి రవికుమార్ కోరారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని శుక్రవారం అటవీశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా స్థానిక మున్సిఫ్ కోర్టు ఆవరణలో జడ్జి రవి కుమార్, ఎఫ్ డిఓ సర్వేశ్వర్ లు మొక్కలు నాటారు.
