Environment | ప్రకృతి ఒడిలో పాఠాలు.. విద్యార్థులకు క్షేత్ర పర్యటనలు
Environment | ప్రకృతి ఒడిలో పాఠాలు.. విద్యార్థులకు క్షేత్ర పర్యటనలు
Environment | నర్సింహులపేట, ఆంధ్రప్రభ : మండలంలోని పడమటిగూడెం గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎర్ర పూర్ణచందర్ ఆధ్వర్యంలో విద్యార్థులను క్షేత్ర పర్యటనకు ఈ రోజు తీసుకువెళ్లారు. పాఠశాలలో పేరెంట్స్, టీచర్స్ సమావేశం నిర్వహించిన అనంతరం నాలుగవ శనివారం సందర్భంగా “నో బ్యాగ్ డే(No bag day)” కార్యక్రమంను నిర్వహించారు.
ఉపాధ్యాయ బృందంతో విద్యార్థులను క్షేత్ర పర్యటనకు తీసుకొని వెళ్లడం జరిగింది. విద్యార్థులకు ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, క్విజ్ పోటీలు(Quiz Competitions) నిర్వహించడం జరిగింది. ఈక్షేత్ర పర్యటన ద్వారా విద్యార్థులలో పాఠ్యాంశంలోని అంశాలు సులువుగా అర్థమయ్యే రీతిలో ఉంటుందని, సృజనాత్మకత పెరుగుతుందని పర్యావరణం(environment) పట్ల అవగాహన కలుగుతుందని ఈ పర్యటన ద్వారా ప్రధానోపాధ్యాయులు తెలియజేశారు.
ఈకార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం శ్రీనివాసు, మురళీధర్, శేఖర్, తిరుపతయ్య, వెంకన్న సీఆర్పీలు జక్కిరవి, శేషుకుమార్, నరహరి, వీరన్న, నాగేశ్వర్ రావు, పాఠశాల సిబ్బంది రెహనా, సఫియాబేగం తదితరులు పాల్గొన్నారు.
