భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్య

రాప్తాడు, ఆంధ్రప్రభ : భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నామని మాంటిస్సోరి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ భరత్ కరస్పాండెంట్ కృష్ణ సమీరా పేర్కొన్నారు. రాప్తాడు మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామం దగ్గర ఉన్న మాంటిస్సోరి ఈ.ఎం.స్కూల్ ప్రాంగణంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ భరత్ కరస్పాండెంట్ కృష్ణ సమీరా కలిసి ఐఐటీ-జేఈఈ ఇతర జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలు మరియు సీబీఎస్సీ ఇంటర్ బోర్డు పరీక్షల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పూలమాలలు వేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు.

అలాగే విద్యార్థుల తల్లిదండ్రులను కూడా సగౌరవంగా సన్మానించారు.ఈ సంధర్భంగా మాట్లాడుతూ 2023 నుండి కోటా కరికులమ్ ఆధారిత జెఈఈ కోచింగ్ అందిస్తూ మాంటిస్సోరి సంస్థ అనంతపురంలో ప్రత్యేక గుర్తింపు సాధించింది అని తెలిపారు.6వ తరగతి నుంచే విద్యార్థులను వివిధ జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రతాప్ రెడ్డి అకాడమిక్ ఇన్చార్జ్ డా.ఎం.కె. మధు కో-ఆర్డినేటర్ రమణ అధ్యాపకులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.