laborers | ఉపాధి చట్టం నిర్వీర్యానికి కుట్ర

laborers | ఉపాధి చట్టం నిర్వీర్యానికి కుట్ర

  • సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళ‌న‌, ర్యాలీ

రాప్తాడు, ఆంధ్రప్రభ : కూలీలకు పట్టెడన్నం పెట్టే ఉపాధి హామీ చట్టాన్ని పథకంగా మార్చి నిర్వీరం చేస్తే కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించుతామని సీపీఐ మల్లికార్జున పేర్కొన్నారు. సోమవారం రాప్తాడు మండల కేంద్రం నందు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, సీపీఐ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంపీడీవో విజయలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి చిరుతల మల్లికార్జున, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పీ. రామకృష్ణ హాజరయ్యారు.

laborers

ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మారుస్తూ కొత్త పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం తీవ్ర అన్యాయమన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉపాధి హామీ పథకంపై తీవ్రమైన దాడి మొదలైంద‌న్నారు. పేదలకు పట్టెడన్నం పెట్టే ఉపాధి హామీని ఎలా నిర్వీరం చేయాలో మోడీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింద‌న్నారు. కేంద్ర ప్రభుత్వ కుట్రలను రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం వ్యతిరేకించాలన్నారు. లేదంటే ఆందోళన కార్యక్రమాలు తీవ్ర‌త‌రం చేస్తామ‌ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీకాంత్. చలపతి రాజు, కుల్లాయప్ప నాగరాజు, శేషమ్మ, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

Leave a Reply