వడదెబ్బతో వృద్ధురాలు మృతి…

భీమారం, ఆంధ్రప్రభ ; గత వారం రోజులుగా పెరుగుతున్న ఉష్ణగ్రతల తో ప్రజలు సతమతమవుతున్న నేపథ్యంలో గ్రేటర్ పరిధిలోని ఒకటో డివిజన్ లో వడదెబ్బతో ఆదివారం వృద్ధురాలు మృతి చెందింది. వివరాలలోకి వెళ్తే ఒకటవ డివిజన్ పలివెల్పుల గ్రామానికి చెందిన నక్క మల్లమ్మ ఆదివారం పెరిగిన ఉష్ణోగ్రతలు, ఎండ వేడికి తట్టుకోలేక వడదెబ్బతో మృతి చెందిందని బంధువులు కుటుంబ సభ్యులు తెలిపారు.