naralokesh | 99.3 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత

naralokesh | 99.3 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత

naralokesh | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : ఆంధ్రప్రదేశ్‌లో బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మంత్రి అభినందనలు తెలిపారు.

ఈ ప్రవేశ పరీక్షకు మొత్తం 19,880 మంది విద్యార్థులు హాజరుకాగా.. వారిలో 19,741 మంది ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 99.3గా నమోదైంది.

అర్హత సాధించిన అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డులను అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. త్వరలోనే కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.

Leave a Reply