మండలాన్ని అభివృద్ధి పథంలో నిలిపేందుకు కృషి
మండలాన్ని అభివృద్ధి పథంలో నిలిపేందుకు కృషి
- మండల ప్రజా ప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు
కుభీర్, ఆంధ్రప్రభ : మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలో నిలిపేందుకు ఎన్నో విధాల కృషి చేస్తున్న ఎంపీడీవో గంగాసాగర్ రెడ్డి అభినందనీయుడని కుబీర్ సర్పంచ్ కందూర్ సాయినాథ్ పేర్కొన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రం లోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో గంగాసాగర్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తయిన సందర్భంగా మండల పంచాయతీ కార్యదర్శులు ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలో మాట్లాడిన పలువురు ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీల ప్రతినిధులు ఆయన పనితీరుపై ప్రశంసలు కురిపించారు.
పంచాయతీ ఎన్నికలు, శిథిలావస్థలో కొట్టుమిట్టాడుతున్న మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి మరమ్మతులు చేపట్టి నూతనంగా నిర్మించిన కార్యాలయంలా లక్షలు వెచ్చించి ప్రజలందరూ మెచ్చుకునేలా ప్రతి ఒక్కరు కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్ ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించి ఎక్కడ లోటుపాట్లు జరగకుండా ఆయన చేసిన సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ భీమేష్, కుబీర్ సర్పంచ్ కందూరి సాయినాథ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎన్నిల అనిల్, ఆత్మ చైర్మన్ సిద్ధం వివేకానంద, ఏఎంసి మాజీ కందూర్ సంతోష్, ఏపీo హర్లాల్, పంచాయతీ కార్యదర్శుల జిల్లా ఉపాధ్యక్షులు తోట సంజీవ్, మండల అధ్యక్ష కార్యదర్శులు, విజయ్ కుమార్, పాముల కిరణ్, ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు.
