పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ: స్థానిక శాంతినగర్ RK4 గడ్డలోని నవోదయ ఉన్నత పాఠశాల శుక్రవారం మధురస్మృతులతో కళకళలాడింది. 2004–2005 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కన్నుల పండువగా జరిగింది.

దాదాపు రెండు దశాబ్దాల తర్వాత గురువులు, తోటి విద్యార్థులు ఒకే వేదికపై కలవడంతో పాఠశాల ప్రాంగణం ఉద్వేగభరితంగా మారింది. పూర్వ విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సాదరంగా ఆహ్వానించి, శాలువాలతో ఘనంగా సన్మానించారు.

వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు ఈ వేడుక కోసం ప్రత్యేకంగా తరలివచ్చి, చిన్ననాటి స్నేహితులతో ముచ్చట్లు పంచుకున్నారు. వారు, “గురువుల సమక్షంలో మళ్ళీ కలవడం అద్భుతమైన అనుభూతి. మా ఎదుగుదలకు పునాది వేసిన పాఠశాలను, గురువులను ఎప్పటికీ మరవలేము” అని భావోద్వేగంతో తెలిపారు.

కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఎండి యాకుబలి, హెడ్మాస్టర్ సోమయ్య, ఉపాధ్యాయులు అహ్మద్ అలీ, విజయ్, పిలుమల్ల గట్టయ్య, సమ్మయ్య, రవీందర్ పాల్గొన్నారు.

Leave a Reply