నులిపురుగుల నివారణ మాత్రలు తప్పనిసరిగా వేయించాలి:

సర్పంచ్ స్టీఫెన్

కడెం, ఆంధ్రప్రభ : పిల్లల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతి విద్యార్థికి నులిపురుగుల నివారణ మాత్రలు తప్పనిసరిగా వేయించాలని దిల్దార్ నగర్ గ్రామ సర్పంచ్ బద్దెనపల్లి స్టీఫెన్ అన్నారు.

సోమవారం కడెం మండలంలోని దిల్దార్ నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నులిపురుగుల నివారణ అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పిల్లల ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు నులిపురుగుల నివారణ ఎంతో అవసరమని, తల్లిదండ్రులు ప్రతి సంవత్సరం ప్రభుత్వం నిర్వహించే ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె. వినయ్ కుమార్, హెల్త్ అసిస్టెంట్ ఐటెం రాజేశ్వర్, అంగన్‌వాడీ టీచర్ రుక్మిణి, విద్యార్థులు పాల్గొన్నారు.