38people | డ్రైవర్ నిద్రమత్తుతోనే…

38people | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరులోని హైవేపై ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏలూరు నుంచి చెన్నై వైపు వెళ్తున్న టూరిస్ట్ బస్సు నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ జంక్షన్ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 38మంది ప్రయాణికులు గాయపడ్డారు.

38people

ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం.. వేగంగా వెళ్తున్న బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డుపై బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.