అన్నదానానికి రూ.1.25 లక్షల విరాళం..

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ ; విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కొనువైన కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు నిత్యాన్నసేవ కు కృష్ణా జిల్లాకు చెందిన వనుకూరి వంశీ కృష్ణ విరాళం అందజేశారు.

పెనమలూరు గోశాల, వనుకూరు గ్రామానికి చెందిన వనుకూరి వంశీ కృష్ణ తన తండ్రి శివ రామ ప్రసాద్ రావు పేరుతో అన్నదానానికి రూ.1,25,000 విరాళంగా సమర్పించారు. ఈ మొత్తం ద్వారా దేవస్థానంలో జరుగుతున్న నిత్య అన్నదానానికి విరాళం అందజేశారు.

వీరికి ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేయగా వేద ఆశీర్వచనం అనంతరం ప్రధానాలయ సూపర్డెంట్ సత్యనారాయణ అమ్మవారి చిత్రపటం రసీదు అందజేశారు, ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ జగన్ తో పాటు ఇతర అధికారులు ఉన్నారు.

Leave a Reply