Vijayawada అన్నదానానికి రూ.9 లక్షల విరాళం..

Vijayawada అన్నదానానికి రూ.9 లక్షల విరాళం..

  • ఇంద్రకీలాద్రిలో భక్తిశ్రద్ధలతో చెక్కు అందజేత

ఇంద్రకీలాద్రి, Vijayawada– ఆంధ్రప్రభ: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి నిత్య అన్నదాన విభాగానికి ఒంగోలుకు చెందిన దాత బబ్బూరి సుబ్బారావు దంపతులు, వారి కుటుంబ సభ్యులు రూ.9 లక్షల విరాళం అందజేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు మామిడిపాలెం రోడ్డుకు చెందిన ఈ దాత కుటుంబం అమ్మవారిపై ఉన్న భక్తిశ్రద్ధలతో ఆలయానికి విచ్చేసి విరాళాన్ని సమర్పించింది. ఆలయ అర్చకుల ఆశీర్వచనాల మధ్య దాతలు చెక్కును దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ)కు భక్తిపూర్వకంగా అందజేశారు. దాతల సేవా భావాన్ని అభినందించిన ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, అన్నదాన కార్యక్రమానికి అందుతున్న విరాళాలు భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు ఉపయోగపడతాయని తెలిపారు.

Leave a Reply