Sharmila Fire : గొంతు నొక్కే కుట్ర Andhra Prabha News
Sharmila Fire : గొంతు నొక్కే కుట్ర Andhra Prabha News
మోదీ నిరంకుశత్వానికి పరాకాష్ట
ప్రశ్నించే స్వరాన్ని చంపాలనే ప్రయత్నం
ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో)
విపక్ష నేత రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు చేయాలని బీజేపీ డిమాండ్ చేయడం సిగ్గుచేటని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి (Sharmila Fire) తీవ్రంగా విమర్శించారు. ఇది ప్రశ్నించే గొంతును చంపాలనే కుట్రగా అభివర్ణించారు. దేశ ప్రతిపక్ష నేతపై సబ్ స్టాంటివ్ మోషన్ పెట్టడం ప్రధాని నరేంద్ర మోదీ నిరంకుశత్వానికి పరాకాష్ట అని వ్యాఖ్యానించారు. అమెరికా ట్రేడ్ డీల్‌పై రాహుల్ గాంధీ నిజాలు వెలుగులోకి తెస్తే మోదీ వణికిపోతున్నారని ఆరోపించారు. అందుకే సభాహక్కుల పేరుతో రాహుల్ గాంధీ గొంతు నొక్కాలని చూస్తున్నారని తెలిపారు. బ్లాక్ డీల్‌పై కుండబద్దలు కొట్టినందుకు రాహుల్ గాంధీని దేశద్రోహిగా ముద్ర వేయడం అన్యాయమన్నారు. వ్యతిరేక శక్తులతో కుమ్మక్కయ్యాడంటూ నిందలు వేయడం, నిధులు, ఆత్మకథల పేరుతో కట్టుకథలు అల్లడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. ఇదేనా ఆర్‌ఎస్‌ఎస్ ఉగ్రవాద రాజకీయమని ప్రశ్నించారు.
