పిల్లలను ప్రభుత్వ బడిలోనే చేర్పించాలి..
పిల్లలను ప్రభుత్వ బడిలోనే చేర్పించాలి..
డీఈవో సుధాకర్
గోనెగండ్ల, ఆంధ్రప్రభ : పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతానికి తల్లిదండ్రులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. గురువారం మండల కేంద్రమైన గోనెగండ్ల లోని స్థానిక పంచాయతీ కార్యాలయం నుండి కురవపేట పాఠశాల వరకు బడి పిలుస్తుంది కార్యక్రమం పై ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని ఆయన కోరారు.
ప్రభుత్వం పిల్లల కోసం ఉచితంగా, బ్యాగు పుస్తకాలు, నోటు పుస్తకాలు బట్టలు, బూట్లు వంటివి ఉచితంగా ఇస్తుందన్నారు. అంతేకాక ప్రభుత్వ పాఠశాల ల లో ప్రవేట్ పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్యను ఉపాధ్యాయులు అందిస్తున్నారన్నారు. అలాగే ఇంటింటికి తిరిగి పిల్లలను పాఠశాలలో చేర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో గోనెగండ్ల మండలవిద్యాశాఖ అధికారులు రామంజినేయులు, నీలకంఠ, ఉపాధ్యాయులు రహంతుల్లా పాల్గొన్నారు.
