భారత ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్ కు ఘన స్వాగతం
గన్నవరం, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా భారత ఎన్నికల సంఘం డిప్యూటీ ఎన్నికల కమిషనర్ భాను ప్రకాష్ ఏటూరు, భారత ఎన్నికల సంఘం సెక్రటరీ నవీన్ మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంకు చేరుకున్నారు.
ఈ సందర్భంగా వారికి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కలంకారి ఉత్పత్తులను అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. కలెక్టర్‌తో పాటు గుడివాడ రెవెన్యూ డివిజనల్ అధికారి జి. బాలసుబ్రహ్మణ్యం, విమానాశ్రయ సీఎస్‌వో కె. ధర్మేంద్ర, గన్నవరం మండల తహసీల్దార్ శివయ్య తదితర అధికారులు వారికి స్వాగతం పలికారు. అనంతరం ఎన్నికల సంఘం అధికారులు రోడ్డు మార్గాన విజయవాడకు బయలుదేరి వెళ్లారు.
