శ్రవణ నక్షత్రం సందర్భంగా వెంకటేశ్వరస్వామికి విశేషాభిషేకాలు
చిట్టినగర్, ఆంధ్రప్రభ : విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 46వ డివిజన్ భీమనవారిపేటలో ఉన్న శ్రీ విజయదుర్గా రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో వెలసిన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామివారికి శ్రవణ నక్షత్రం సందర్భంగా గురువారం విశేష పూజలు, అభిషేకాలు వైభవంగా నిర్వహించారు.
వ్యవస్థాపక పురోహితులు చింతలపాటి సుబ్రహ్మణ్య శాస్త్రి ఆధ్వర్యంలో స్వామివారికి క్షీరం, పెరుగు, ఆవు నెయ్యి, పంచదార తదితర పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పళ్లరసాలు, పసుపు, కుంకుమ, గంధం తదితర సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు చేశారు.
శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని వేదమంత్రోచ్ఛారణల నడుమ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామివారికి శాంతి కల్యాణం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉభయదాతలు అనపాల సోమశేఖర్ రెడ్డి–సౌజన్య దంపతుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
