నేటి నుండి వేరుశనగ విత్తన పంపిణీ
నేటి నుండి వేరుశనగ విత్తన పంపిణీ
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : రైతులకు ఆదుకోవాలని ఉద్దేశంతో విత్తన పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈనెల 15వ తేదీ నుండి మండలంలోని వివిధ గ్రామా లలోని, రైతు సేవా కేంద్రంలో సబ్సిడీతో వేరుశ నగ విత్త నాలను పంపిణీ చేస్తున్నట్లు ఉరవకొండ మండల వ్యవసాయ అధికారి రామకృష్ణుడు తెలిపారు. ఉరవకొండ పట్టణంలోని ఏడిఏ కార్యాలయంలో లాంఛనంగా వేరుశనగ విత్తన పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తు న్నట్లు తెలిపారు. మండలం లోని వివిధ గ్రామాలలో ఉన్న, రైతు సేవా కేంద్రాలలో వేరు శనగ విత్తన పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతు న్నామని తెలిపారు.
కావున ఎవరైతే రైతులు వేలి ముద్ర లు నమోదు చేసుకొని, నగదు చెల్లించిన రైతులకు వేరుశనగ విత్తనాలను పంపిణీ చేయడం జరుగుతుం దన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కె6, టి సి జి ఎస్-1694 రకం పూర్తి ధర 10, 200 సబ్సిడీ 4,080 రైతు చెల్లించాలన్నారు చెల్లించవల సిన ధర 6,120 రూపాయలు అర్థ ఎకరా 1 సంచి ( 30 కేజీలు) ఒక్క ఎకరా 2 సంచు లు (60 కేజీలు) ఒక ఎకరా పైన ఉంటే( 90 కేజీలు) కే6 రకం 1800, టి సి జి ఎస్ -1694 100, కదిరి లేపాక్షి-100 క్వింటాళ్లు కేటాయించినట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న రైతుల సంఖ్య 369, వేరుశనగ 321 క్వింటాళ్లు తెలిపారు.
