స్వామివారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయండి

స్వామివారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయండి
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నా హోబిలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మో త్సవాలను విజయవంతం చేయాలని గుంతకల్లు రెవిన్యూ డివిజన్ అధికారి శ్రీనివాస్ పిలుపు నిచ్చారు. ఈనెల 28 నుండి స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మే 6వ తేదీన జరిగే స్వామివారి బ్రహ్మరథోత్సవానికి వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది.
ఉరవకొండలోని తహసిల్దార్ కార్యాలయంలో గురువారం మే 6వ తేదీ జరిగే బ్రహ్మోత్సవాలపై గుంతకల్లు రెవెన్యూ డివిజన్ అధికారి శ్రీనివాస్ అధ్యక్షతన మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గుంతకల్లు రెవెన్యూ డివిజన్ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ స్వామివారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా అన్ని శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. రథోత్సవ రోజున భారీ రద్దీ ఉండే అవకాశం ఉందని, ట్రాఫిక్ నియంతరణ, పార్కింగ్ ఏర్పాట్లు, భద్రత చర్యలు పకడ్బందీగా చేపట్టాలన్నారు.
తాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. ఆలయ పరిసరాలలో తాత్కాలిక నీటి నిల్వ సౌకర్యాలు కల్పించాలన్నారు. ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని, అదేవిధంగా అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉండాలన్నారు. ఆలయ పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులను చేపట్టాలన్నారు. తాత్కాలిక మరుగుదొడ్లు, చెత్త సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి, నిరంతరం శుభ్రత నిర్వహించాలన్నారు. నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలాగా చర్యలు చేపట్టాలన్నారు.
అగ్నిమాపక శాఖ అత్యవసర పరిస్థితు లకు సిద్ధంగా ఉండి, ఫైర్ సేఫ్టీ చర్యలను పర్వేవేక్షించాలన్నా రు. ఈ సమావేశంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రేగటి నాగరాజు, జిల్లా దేవాదాయ శాఖ అధికారి గంజి మల్లికార్జున ప్రసాద్, ఎంపీడీవో రవి ప్రసాద్, దేవాలయ ఈవో సాకే రమేష్ బాబు, ఉరవకొండ అర్బన్ సీఐ మహానంది, ఎస్సై జనార్దన్ నాయుడు, డిప్యూటీ ఎంపీడీవో సతీష్ కుమార్, అగ్నిమాపక అధికారి భీమ లింగయ్య, ట్రాన్స్కో ఏ ఈ గురుమూర్తి, ఉరవకొండ ఆర్టీసీ డిఎం హంపన్న, ఆర్ ఐ రామకృష్ణ, ఎలక్షన్ డ్యూటీ వరప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ ఫక్రుల్లా, షఫీ, ఆర్ డబ్ల్యూ ఎస్ జేఈ ఐజయ్య, షేక్ షాన్ పల్లి పంచాయతీ అభివృద్ధి అధికారి రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.
