నిరుపేదలకు ఎల్‌ఓసీ పత్రాల పంపిణీ
మెరుగైన వైద్యం కోసం రూ.6.84 లక్షల ఎల్‌ఓసీ పత్రాలు అందజేత
ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవ
భవానిపురం, ఆంధ్రప్రభ: ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎమ్మెల్యే సుజనా చౌదరి లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌ఓసీ) పత్రాలను మంజూరు చేస్తున్నారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ కూటమి నాయకులతో కలిసి భవానిపురంలోని ఎన్డీయే కార్యాలయంలో బాధితులకు ఎల్‌ఓసీ పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా 48వ డివిజన్ చిట్టినగర్‌కు చెందిన అక్కిశెట్టి మురళి (63) హృద్రోగంతో బాధపడుతూ వైద్య సహాయం కోసం దరఖాస్తు చేసుకోగా, ఆయనకు రూ.5 లక్షల విలువైన ఎల్‌ఓసీ అందజేశారు.
అలాగే 35వ డివిజన్ డేవిడ్ స్ట్రీట్‌కు చెందిన జూపూడి జ్యోతి (44) అడెనోమయోసిస్, గర్భాశయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం ఎల్‌ఓసీ కోరగా, ఆమెకు రూ.1.84 లక్షల విలువైన ఎల్‌ఓసీ మంజూరు చేసి అందించారు.
త్వరితగతిన స్పందించి వైద్య సహాయం అందించిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి బాధితులు, వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పోతిన భేషు కంటేశ్వరుడు, దేవిన హరి ప్రసాద్, చొక్కర పాపారావు, ప్రముఖ న్యాయవాది చాట్ల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
