హనుమాన్‌పేటలో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు

హనుమాన్‌పేటలో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
టీడీపీ సీనియర్ నాయకుడు గన్నే ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహణ
కేక్ కటింగ్‌తో శుభాకాంక్షలు
ముఖ్య అతిథిగా బొప్పన భవకుమార్ హాజరు..
నాయకులు, కార్యకర్తల సందడి..
విజయవాడ, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు విజయవాడ హనుమాన్‌పేటలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ సీనియర్ నాయకులు గన్నే ప్రసాద్ (అన్నా) ఆధ్వర్యంలో ఆయన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ వేడుకలకు టీడీపీ రాష్ట్ర నాయకులు బొప్పన భవకుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

అనంతరం నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ… చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తోందని పేర్కొన్నారు.

ఆయన దీర్ఘాయుష్షు, ఆరోగ్యంతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు జాస్తి సాంబశివరావు, ఉమ్మడి చంటి, కరణం జగన్మోహన్, యలమంచిలి శ్రీనివాసరావు, పొన్నం రవి, తాడికొండ నరేంద్ర, వెల్లంకి సుధాకర్, ఈడుపుగంటి అజయ్, బి. ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

