ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్

రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా
నూతన గైనకాలజిస్టు డాక్టర్ కంభంపాటి సాయి శివ భావనకు సత్కారం

చల్లపల్లి, ఆంధ్రప్రభ: చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఓపీలో ఉన్న రోగులను పరామర్శించి వారి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు అందిస్తున్న సేవలను పరిశీలించి పలు సూచనలు చేశారు.

నూతన గైనకాలజిస్టుగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ కంభంపాటి సాయి శివ భావనను అభినందించి సత్కరించారు. రోగులకు ఉత్తమ వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.ఎస్. శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ మోర్ల రాంబాబు, ఆసుపత్రి డైరెక్టర్ వరదా హరిగోపాల్ పాల్గొన్నారు.