కలెక్టర్‌ను కలిసిన డీహెచ్‌పీఎస్ నేత

కరీమాబాద్, ఆంధ్రప్రభ : వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదను డీహెచ్‌పీఎస్ జిల్లా కార్యదర్శి సంఘీ ఏలేందర్ కలిసి వివిధ సమస్యలను వివరించారు.
ఆదివారం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా లాల్ బహదూర్ కాలేజీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా దళిత హక్కుల పోరాట సమితి (DHPS) వరంగల్ జిల్లా కార్యదర్శి సంఘీ ఏలేందర్ పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.
