మైనర్ బాలికపై అఘాయిత్యం
గంగవరం, ఆంధ్రప్రభ: మండలంలోని ఓ గ్రామంలో మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఓ వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ రాంభూపాల్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మండలానికి చెందిన ఓ 17 ఏళ్ల బాలిక గంగవరంలోని ప్రైవేటు కాలేజీలో ఇంటర్ చదువుతోంది.
ఈ క్రమంలో ప్రతి రోజూ ఆమె ఆటోలో కళాశాలకు వెళ్లి వస్తుండటాన్ని గమనించిన వినోద్ అనే వ్యక్తి అదే ఆటోలోనే వస్తూ పరిచయం ఏర్పరచుకున్నాడు. కొన్ని రోజులకే ఆ అమ్మాయికి మాయ మాటలు చెప్పి, ఓ నిర్జన ప్రదేశానికి తీసుకొని వెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కాగా బాలిక జరిగిన అఘాయిత్యాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఆయన అన్నారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఆయన మీడియాకు తెలిపారు.
