‘కాగార్ ‘కలిచి వేసింది

  • వెంకటి ది వీరమరణం
  • మావోయిస్ట్ పార్టీ మాజీ మహిళ అగ్ర నేత జాడి పుష్ప

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: కాగార్ ఆపరేషన్ కలిచివేసిందని మావోయిస్టు పార్టీ మాజీ మహిళా అగ్రీ నేత ఆవుల బాల మల్లు అలియాస్ జాడిపుష్ప అన్నారు. గురువారం స్వంత గ్రామం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామానికి ఆమె 30 ఏళ్ల తర్వాత చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు కుటుంబీకులు మంగళహారతులతో పుష్పకు ఘన స్వాగతం పలికారు. ఆమె తల్లి ఆవుల మల్లమ్మ పుష్ప ను అక్కున చేరుకొని కన్నీటి పర్యంతమయ్యారు. ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నావు బిడ్డా అల్లుడు ఏమాయే బిడ్డా అంటూ రోదించారు.

ఈ సందర్భంగా గ్రామంలోని ఆంజనేయ స్వామి విగ్రహం నుంచి మొదలైన ర్యాలీ పుర వీధుల గుండా ఆమె అన్న శ్రీనివాస్ ఇంటి వరకు కొన సాగింది. సందర్భంగా గ్రామ ప్రజలు శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించి పుష్పను ఆలింగనం చేసుకున్నారు.ఈ సందర్భంగా పుష్ప మాట్లాడుతూ.. 1995 లో గ్రామంలో జాడి వెంకటి నాటి పీపుల్స్ వార్ పార్టీ లో పనిచేస్తుండగానే తనను ప్రేమ వివాహం చేసుకున్నాడని తెలిపారు. అప్పటి నుంచి పార్టీ లో టెక్నికల్ కమిటీ లో కలిసి పనిచేస్తూ దండకారణ్యంలో జీవనం సాగించినట్లు ఆమె తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కగార్ ఆపరేషన్ తమను కలిసి వేసిందన్నారు. పార్టీ లో ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం లో జాడి వెంకటి పార్టీ లో అంచె లంచెలుగా ఎదిగి డీవీసీ కార్యదర్శిగా పని చేస్తున్న క్రమంలో కగార్ ఆపరేషన్ లో2025 సెప్టెంబర్ 11న చంప బడ్డారని ఆమె పేర్కొన్నారు. ఒరిస్సా రాష్ట్రంలో ని రూర్కేలా లో 2007 లో అరెస్టయ్యారని ఆ తర్వాత 2009 జనవరిలో జైలు నుంచి విడుదలయ్యాక పార్టీలోనే తనతో కలిసి ప్రజల కోసం ఏం చేస్తున్న క్రమంలో వీరమరణం పొందాడని పుష్ప స్పష్టం చేశారు. అనేక ఎన్కౌంటర్ సంఘటన నుంచి తాను, తన భర్త తప్పించుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. చివరి వరకు తాను తన భర్త పార్టీలో పనిచేస్తూ కలిసే ఉన్నట్లు ఆమె వెల్లడించారు.

తానూ కుటుంబీకుల తోనే కలిసి జీవిస్తా..

మావోయిస్ట్ పార్టీ లో మూడు దశాబ్దాల పాటు దండకారణ్యంలో పనిచేసిన తాను డీవీసీ కమిటీలో ఏసీ సెక్రటరీ గా పని చేస్తూ ఉద్యమం వీడి 2026 జనవరి 20న అఙ్ఞాత వాసం వీడి జనజీవన స్రవంతిలో కి వచ్చినట్లు ఆమె తెలిపారు. తాను ఇక నుంచి కుటుంబీకులతో కలిసి జీవనం సాగిస్తానని పేర్కొన్నారు.