కల్వల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన సిపిఎం

కేసముద్రం, ఆంధ్రప్రభ : కేసముద్రం మండలం కల్వల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సిపిఎం పార్టీ మండల కమిటీ బృందం ఆదివారం సందర్శించారు. సిపిఎం నాయకులు మాట్లాడుతూ.. పది రోజుల క్రితం ధాన్యం కొనుగోలుకేంద్రంప్రారంబించారు , తేమ శాతం అధికంగా ఉండడంతో 8వ తారీకు నుండి బస్తాలు నింపి కంటాలు ప్రారంభించారు. శనివారం సాయంత్రం అకాల వర్షంతో రైతులు, ఇబ్బంది పడ్డారని, నింపిన బస్తాలు కంటాలు పెట్టి మిల్లులకు తరలించాలని, తేమపేరుతొ, ఎలాంటి తరుగు తీయవద్దని, కంటాలు పెట్టిన వారం లోపు రైతులకు డబ్బులు చెల్లించాలని, మద్దతూ ధర 500బోనస్ త్వరితాగతినా చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమం లో సిపిఎం మండల కార్యదర్శి గోడిశాల వెంకన్న, మండల కమిటీ సభ్యులు మోడెం వెంకటేశ్వర్లు, జల్లే జయరాజ్, నీరుటి జలందర్, సుంకరి వెంకన్న, రైతులు పెద్దరపు. అశోక్, ధరవత్ రవి, ఎడెల్లిశ్రీనివాస్ రెడ్డి, ఎం.వెంకట్ రెడ్డి,సపవట్ సజ్జన్, ధరవత్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.
