రేగొండలో విషాదం.. ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతి

రేగొండలో విషాదం.. ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతి

రేగొండ, ఆంధ్రప్రభ: రేగొండ మండలంలోని రేపాకపల్లి గ్రామంలో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ మృతి చెందిన విషాద సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చేరి సుమన్ (37) సోమవారం రాత్రి TS25D 9123 నంబర్ గల ట్రాక్టర్‌లో తన చిన్ననాన్న చేరి ప్రభాకర్ రెడ్డికి చెందిన ఆయిల్ ఫామ్ గోలలను ఎక్కించుకుని వరుణ్ సందేశ్‌తో కలిసి పరకాల ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ ఆయిల్ ఫామ్ వద్ద సరుకు దింపిన అనంతరం తిరుగు ప్రయాణంలో దమ్మన్నపేట చెరువు మూలమలుపు వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది.

ఈ ప్రమాదంలో సుమన్ తీవ్రంగా గాయపడగా వెంటనే అతడిని పరకాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ట్రాక్టర్‌లో ఉన్న వరుణ్ సందేశ్‌కు ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుధాకర్‌ వెల్లడించారు. మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని కుటుంబ సభ్యులు తెలిపినట్లు సమాచారం.

Leave a Reply