బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా.. ఘన నివాళులు

బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా.. ఘన నివాళులు

సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు.

పాయకాపురం, ఆంధ్రప్రభ : 59వ డివిజన్ సింగ్ నగర్ లూనా సెంటర్‌లోని బాబు జగజ్జీవన్ రామ్ గారి విగ్రహం వద్ద సెంట్రల్ ఎస్. సి సెల్ అధ్యక్షుడు వేల్పుల రాజేష్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్118వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని ఈ సందర్భంగా ముందుగా బాబు జగజ్జీవన్ రామ్  విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.

అనంతరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి  పూలమాలవేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో సెంట్రల్ యూత్ అధ్యక్షుడు బెజ్జం జైపాల్,కంబగళ్ళ రాజు, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply